సమంత యశోద మూవీ అప్‌డేట్

January 18, 2022


img

సమంత ప్రధాన పాత్రలో హరి, హరీష్ దర్శకత్వంలో రూపొందుతున్న యశోద చిత్రం షూటింగ్ గత నెలలోనే ప్రారంభమైంది. ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్‌ సిరీస్‌తో సమంత జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందడంతో యశోదను పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌లో నిర్మిస్తున్నట్లు ఈ సినిమా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ సినిమా షూటింగ్ మార్చి నెలాఖరుకి పూర్తి చేసి ఏప్రిల్ నెలలో విడుదల చేయాలని భావిస్తునట్లు తెలిపారు. 

ఈ సినిమాలో సమంత ఓ గర్భిణి నర్సుగా చేస్తున్నట్లు ఓ వార్త బయటకు వచ్చింది. కానీ సినీ దర్శక నిర్మాతలు దీనిని దృవీకరించవలసి ఉంది. 

యశోద తెలుగు వెర్షన్‌కు మణిశర్మ సంగీతం, ఎం.సుకుమార్ కెమెరా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, డా.చల్లా భాగ్యలక్ష్మి, చిన్న నారాయణ మాటలు, రామజోగయ్య శాస్త్రి పాటలు అందిస్తున్నారు.Related Post

సినిమా స‌మీక్ష