మేము విడిపోతున్నాం: ధనుష్, ఐశ్వర్య

January 18, 2022


img

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య, కోలీవుడ్ నటుడు ధనుష్ విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇద్దరూ కలిసి తమ అభిమానులకు వ్రాసిన లేఖనువేర్వేరుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానిలో వారు ఏమి వ్రాశారంటే, 18 ఏళ్ళపాటు స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లితండ్రులుగా, పరస్పర శ్రేయోభిలాషులుగా కలిసి జీవించిన మేము విడిపోవాలని నిర్ణయించుకొన్నాము. కనుక మా నిర్ణయాన్ని గౌరవించి మా వ్యక్తిగత గోప్యతను గౌరవించాల్సిందిగా కోరుతున్నాము,” అని ధనుష్ ట్విట్టర్‌లో , ఐశ్వర్య ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.   

ధనుష్, ఐశ్వర్యల వివాహం 2004, నవంబర్‌ 18న జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ 18 ఏళ్ల వైవాహిక జీవితంలో వారిరువురి మద్య ఎటువంటి విభేధాలు తలెత్తిన దాఖలాలు లేవు. 2011లో ధనుష్, శ్రుతిహాసన్ జంటగా నటించిన ‘3’ అనే సినిమాకు ఐశ్వర్య’ దర్శకత్వం కూడా చేశారు. ఆ సినిమాలో ‘వై దిస్ కోలవేరీ’ పాట ఎంత ఆదరణ పొందిందో అందరికీ తెలుసు., 18 ఏళ్ళ వైవాహిక జీవితం గడిపిన తరువాత ధనుష్, ఐశ్వర్య మద్య ఎందుకు మనస్పర్ధలు వచ్చాయో...ఎందుకు విడిపోతున్నారో ఇంకా తెలియవలసి ఉంది.     

           Related Post

సినిమా స‌మీక్ష