సమంతా! ఉ...అంటావా...ఊఊ...అంటావా?

December 03, 2021


img

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మికా మందన జంటగా నటిస్తున్న పుష్ప సినిమాకు సంబందించిన వెలువడుతున్న వార్తలు, ఆ సినిమా టీజర్, పాటలతో రిలీజ్ కాకమునుపే చాలా భారీ అంచనాలు ఏర్పడేలా చేస్తోంది. ఈ సినిమాలో సమంత ఓ ప్రత్యేక గీతంలో అల్లు అర్జున్‌తో కలిసి చిందేయబోతోందనే సంగతి తెలిసిందే. ఆ పాటకు సంబందించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు పోక్కింది. దాని లిరిక్స్ ఉ...అంటావా...ఊఊ...అంటావా?అంటూ మొదలవుతాయనేది దాని సారాంశం. ఇప్పటికే విడుదలైన నాలుగు సాంగ్స్‌ ఓ రేంజ్‌లో ఉన్నాయి. సమంత చేస్తున్న ఈ సాంగ్‌ వాటిని మించినదిగా ఉంటుందని తెలుస్తోంది. అందుకే ఈ మూవీ మేకర్స్ ఈ పాటకు సమంతను ఎరికోరి తీసుకొన్నారని తెలుస్తోంది. ఈ నెల 17న ‘పుష్ప ది రైజ్’ పార్ట్-1 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. కనుక త్వరలోనే సమంత చేసిన ఈ ప్రత్యేక గీతం కూడా విడుదలకానుంది. పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్న పుష్ప హిందీ వెర్షన్‌ టీజర్‌ను ఉత్తరాది రాష్ట్రాలలో థియేటర్లలో విడుదల చేశారు. దానికి హిందీ మాట్లాడే ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.           Related Post

సినిమా స‌మీక్ష