అఖండతో బాబాయ్‌కి రీసౌండింగ్ విక్టరీ: జూ.ఎన్టీఆర్‌

December 03, 2021


img

బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో  వచ్చిన అఖండ అంచనాలకు మించి ఉండటంతో బాలయ్య అభిమానుల సంతోషానికి హద్దే లేదు. మురళీకృష్ణగా కాస్త సౌమ్యమైన పాత్రలో, అఖండగా ఒళ్ళు గగుర్పొడిచే ఓ అఘోరా పాత్రలో బాలకృష్ణ విశ్వరూపం చూసి అభిమానులు మురిసిపోయారు. బాలయ్య అభిమానులు ఆయన నుంచి ఏమి కోరుకొంటారో బోయపాటి సరిగ్గా అదే ఇవ్వడంతో సినిమాకు సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చింది. జూ.ఎన్టీఆర్‌ కూడా ఈ సినిమా చూసి బాబాయ్ బాలకృష్ణకు అభినందనలు తెలియజేశారు. ఈ సినిమాతో రీసౌండింగ్ విక్టరీ అందుకొన్న బాల బాబాయ్‌కి, యూనిట్‌లో అందరికీ ట్విట్టర్‌లో అభినందలు తెలిపారు.      Related Post

సినిమా స‌మీక్ష