రోడ్డు ప్రమాదంలో నిర్మాత జక్కుల నాగేశ్వర రావు మృతి

December 03, 2021


img

ప్రముఖ తెలుగు సినీ నిర్మాత జక్కుల నాగేశ్వర రావు (46) గురువారం రోడ్డు ప్రమాదంలో మరణించారు. కృష్ణా జిల్లాలోని నెప్పల్లి నుంచి ఆయన గుడివాడకు కారులో వెళుతుండగా విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. దారిలో తాడంకి వద్ద రోడ్డు పక్కనే పంక్చర్ షాపు వద్ద కారును ఆపి టైర్లలో గాలి కొట్టిస్తున్నప్పుడు ఆయన కారు దిగి రోడ్డు పక్కన నిలబడి ఎవరితోనో మాట్లాడుతుండగా వెనక నుంచి దూసుకువచ్చిన ఓ లారీ బలంగా ఢీకొట్టడంతో ఆయన ఘటనా స్థలంలోనే చనిపోయారు.   

జక్కుల నాగేశ్వర రావు వీడు సరైనోడు, అమ్మానాన్న ఊరేళ్ళితే, లవ్ జర్నీ తదితర సినిమాలు నిర్మించారు. ఆయనకు భార్య ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. మూడు నాలుగురోజుల వ్యవధిలో తెలుగు సినీ పరిశ్రమలో మొదట కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్, తరువాత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఇప్పుడు జక్కుల నాగేశ్వర రావు మరణించారు. Related Post

సినిమా స‌మీక్ష