రాధేశ్యామ్... రెండో సాంగ్ రిలీజ్

December 02, 2021


img

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ‘రాధేశ్యామ్’ సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చే నెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. కనుక రాధేశ్యామ్ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే ‘ఈ రాతలే...’ అంటూ విడుదల చేసిన తొలిపాటకు మంచి స్పందన వచ్చింది. బుదవారం ‘లవ్ ఆంథమ్’ పేరుతో ఈ సినిమా హిందీ వెర్షన్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇవాళ్ళ తెలుగు వెర్షన్‌లో రెండో సాంగ్‌ను విడుదల చేశారు. ‘నగుమోము తారాలే...’ అంటూ సిద్ద్ శ్రీరామ్ చాలా కమ్మగా ఆలపించిన ఈ గీతంలో ప్రభాస్, పూజా హెగ్డేల ఆన్‌లైన్‌ కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉంది.   

రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ వింటేజ్ లవ్ స్టోరీని చాలా వరకు ఇటలీలోనే షూట్ చేశారు. ఈ సినిమాలో తొలిసారిగా ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్నారు. దీనిలో ప్రభాస్ పాత్ర పేరు విక్రమాదిత్య. ఓ హస్త సాముద్రిక నిపుణుడుగా చేస్తున్నారు. కనుక ఈ సినిమా ఎవరి అంచనాలకు అందకుండా ఉంది. అందుకే అభిమానులు రాధేశ్యామ్ కోసం చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.  

ఈ సినిమాకు దక్షిణాది భాషల వెర్షన్స్‌కు జస్టిన్ ప్రభాకరన్, హిందీలో అనూమాలిక్, మిథున్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. బాహుబలితో ఉత్తరాది, దక్షిణాది ప్రజలను సమానంగా అలరించిన ప్రభాస్, దాని తరువాత చేస్తున్న ఈ  సినిమాపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియెషన్స్ రెండూ కలిసి దీనిని పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నాయి. Related Post

సినిమా స‌మీక్ష