హాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న సమంత

November 26, 2021


img

దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్న నటి సమంత చైతూతో విడిపోయిన తరువాత మళ్ళీ తన సినీ కెరీర్‌లో మరో మెట్టు పైకి ఎదిగేందుకు అడుగులు వేస్తోంది. ఎవరూ ఊహించని విదంగా ఆమె ఇటీవల పుష్ప సినిమాలో ఓ ప్రత్యేక గీతం చేయబోతోంది. సరైన కధ, పాత్ర దొరికితే బాలీవుడ్‌లోకి ప్రవేశించేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించింది. కనుక త్వరలోనే బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడం ఖాయమే. కానీ అంతకంటే ముందు హాలీవుడ్‌లో ఇవ్వబోతోండుటమే విశేషం. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు ఫిలిపి జనవరి దర్శకత్వంలో ‘అరేంజిమెంట్స్ ఆఫ్ లవ్’ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించబోతోంది. ఈవిషయం సమంత స్వయంగా ట్విట్టర్‌లో ప్రకటించింది. ఈ సినిమాలో అను పాత్రకు నన్ను ఎంచుకొన్నందుకు ధాంక్స్. ఈ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను,” అంటూ ట్వీట్ చేసి దర్శకుడు ఫిలిప్ జాన్‌తో కలిసి దిగిన ఓ ఫోటోను కూడా అభిమానులకు షేర్ చేసింది. 

ఈ సినిమాను అదే పేరుతో తిమేరీ ఎన్ మురారి వ్రాసిన నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. మరో షాకింగ్ విషయమేమిటంటే ఈ సినిమాలో సమంత లెస్బియన్‌గా నటించబోతోంది. భారతీయ సినీ పరిశ్రమలో వేశ్య పాత్రలలో కొంతమంది ప్రముఖ హీరోయిన్లు నటించారు కానీ ఇటువంటి పాత్రలు చేయడం చాలా అరుదు. కొన్ని సినిమాలలో అడపాదడపా ఇటువంటి పాత్రలు కనిపిస్తుంటాయి. తొలిసారిగా సమంత ఎవరూ చేయని ఇటువంటి బోల్డ్ రోల్ చేసేందుకు సిద్దపడుతోంది. అదీ తొలి హాలీవుడ్ మూవీలోనే కావడం విశేషం. సమంత ఇప్పుడు స్వేచ్ఛగా సొంత నిర్ణయాలు తీసుకొంటూ తనకు నచ్చిన విదంగా ముందుకు సాగుతున్నట్లు అర్ధమవుతోంది. ఈ సినిమాతో ఆమె యాక్టింగ్ టాలెంట్ చూసి హాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆమెను ఎత్తుకుపోయినా ఆశ్చర్యం లేదు.


Related Post

సినిమా స‌మీక్ష