ఆచార్యలో రామ్ చరణ్ టీజర్ వచ్చేస్తోంది

November 25, 2021


img

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సిద్ధార్ద్ అనే చాలా పవర్ ఫుల్ పాత్ర చేస్తున్నాడు. దానికి సంబందించి టీజర్ ఈనెల 28న విడుదల చేయబోతున్నట్లు చిరంజీవి స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. సినిమాలో సిద్ద పాత్ర మరుపురానిదిగా నిలిచిపోతుంది. దానికి చాలా కారణాలే ఉన్నాయి. సిద్ద పవర్ ఫుల్ తీజర్ వచ్చేస్తోందని చిరంజీవి వెల్లడించారు. 

దీనిని సినీ దర్శకనిర్మాతలు ‘సిద్ద సాగా’ పేరుతో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ తుపాకీ చేతపట్టుకొన్న ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.   


ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్, పూజ హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా తిర్రు, సంగీతం మణిశర్మ అందిస్తున్నారు. ఆచార్య 2022, ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష