జబర్దస్త్ రష్మీ గౌతమ్‌కు మెగా ఆఫర్

November 24, 2021


img

జబర్దస్త్ షోలో యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న రష్మీ గౌతమ్‌ అడపాదడపా సినిమాలు కూడా చేస్తూనే ఉంది. తాజాగా ఆమెకు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఓ ప్రత్యేక గీతం చేసే ఛాన్స్ లభించినట్లు తెలుస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భోళా శంకర్’ సినిమాలో ఓ ప్రత్యేక గీతం చేసేందుకు ఆఫర్ వచ్చింది. మెగా స్టార్ చిరంజీవి సినిమాస అంటే గ్యారెంటీగా సూపర్ హిట్ కనుక ఈ సినిమాలో మెగా స్టార్ చిరంజీవితో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం లభించడమంటే రష్మీ గౌతమ్‌కు అదృష్టం తలుపు తట్టినట్లే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు చేసుకొని షూటింగ్ ప్రారంభమైంది. 

ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా, కీర్తి సురేష్ హీరోయిన్స్‌గా చేస్తున్నారు. రావు రమేష్, రఘుబాబు, మురళి శర్మ, వెన్నెల కిషోర్, రవిశంకర్, ప్రగతి తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. 

తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకు తెలుగు రీమేక్‌గా రూపొందిస్తున్న భోళా శంకర్ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం సాగర్ మహతి, కెమెరా డూడ్లే, కొరియోగ్రఫీ శేఖర్ మాస్టర్, ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్ చేస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష