బంగార్రాజులో చైతు ఫస్ట్ లుక్‌

November 23, 2021


img

అక్కినేని నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ‘సోగ్గాడే చిన్ని నాయిన’ సినిమాలో బంగార్రాజు పాత్ర చాలా బాగా పండింది. అందుకే బంగార్రాజు పేరుతోనే ఆ సినిమాకు సీక్వెల్ సిద్దం అవుతోంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నాగార్జున, నాగ చైతన్య నటిస్తున్నారు. ఈ సినిమాలో వారికి జంటగా రమ్యకృష్ణ, కృతిశెట్టి నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే బంగార్రాజు ఫస్ట్ లుక్‌ విడుదలైంది. దానిలో కృతిశెట్టిని చూపగా, లడ్డుండా అనే ఓ పాటను కూడా విడుదల చేశారు. ఇవాళ్ళ నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా బంగార్రాజులో చైతు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. 

ఈ సందర్భంగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ సోగ్గాడే చిన్ని నాయిన సినిమాలోలాగే దీనిలో కూడా మంచి రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ ఉంటాయి. ముఖ్యంగా నాగ్, చైతు అభిమానులు కోరుకొనే అన్ని హంగులు దీనిలో ఉంటాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించి కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను మైసూరులో షాట్ చేస్తున్నాం,” అని చెప్పారు. 

ఈ సినిమాలో రావు రమేశ్, చపతిరావు, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్ర్లలో నటిస్తున్నారు. అక్కినేని నాగార్జున ఈ సినిమాను తమ సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా యువరాజ్, సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు. బంగార్రాజు సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 15న వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.


Related Post

సినిమా స‌మీక్ష