బ్రేకప్ తరువాత సామ్, చైతు ఏమన్నారంటే..

November 23, 2021


img

సమంత, నాగ చైతన్య బ్రేకప్ తరువాత ఇద్దరూ వేర్వేరు వ్యాపకాలతో నిమగ్నమై ఆ బాధ నుంచి తేరుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే సమంత తన మనసులో బాధను అభిమానులతో పంచుకొన్నప్పటికీ నాగ చైతన్య మాత్రం ఇంతవరకు ఎవరితోను తన అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకోలేదు. తొలిసారిగా మాథ్యూ మెదక్‌ కెన్నగే అనే రచయిత వ్రాసిన ‘గ్రీన్‌ లైట్స్’ అనే పుస్తకాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసి, దానిలో ‘ఏ లవ్ లెటర్ టు లైఫ్’ నిజంగా తన జీవితంలో ముందుకు సాగేందుకు ఎంతో తోడ్పడుతుంది. థాంక్స్ సర్..” అని రచయితకు కృతజ్ఞతలు తెలిపాడు. 

ఇక సమంత తన స్నేహితురాలితో కలిసి తీర్ధయాత్రలు చేసి తిరిగివచ్చిన తరువాత సినిమాలపై దృష్టి పెట్టింది. ముందుగా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, రష్మిక మందన జంటగా నటిస్తున్న పుష్ప సినిమాలో ఓ ప్రత్యేక గీతం చేయడానికి అగ్రిమెంట్ చేసుకొంది. తమిళంలో విజయ సేతుపతితో ఓ సినిమా చేసేందుకు సంతకం చేసింది. దాని తరువాత డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌లో మరో సినిమాకు సమంత సంతకం చేసింది. త్వరలో బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వబోతునట్లు సమాచారం. అయితే ఇంతవరకు బాలీవుడ్‌లో తాను ఏ సినిమాను ఓకే చేయలేదని తెలిపింది. సినిమా చేయడానికి బాష అవరోదం కాదని కధలో జీవం ఉందా లేదా? ఆ కధకు, పాత్రకు నేను సెట్ అవుతానా లేదా? అని మాత్రమే చూసుకొంటానని సమంత చెప్పింది. ఒకవేళ అటువంటి మంచి కధ, పాత్ర లభిస్తే బాలీవుడ్‌లో తప్పక సినిమా చేస్తానని సమంత చెప్పింది.


Related Post

సినిమా స‌మీక్ష