ఆర్ఆర్ఆర్ మూడో సాంగ్ విడుదల నవంబర్‌ 24న

November 19, 2021


img

రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఆర్ఆర్ఆర్ (రౌద్రం,రణం,రుధిరం) సినిమాకు సంబందించి ఇప్పటికే రెండు సాంగ్స్ విడుదలయ్యాయి. రెంటికీ విశేష స్పందన వచ్చింది. ఇప్పుడు మూడో సాంగ్ రిలీజ్ చేసేందుకు రాజమౌళి సిద్దం అవుతున్నారు. ఈ నెల 24న మూడో సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ బాషలలో రూపొందిస్తున్నందున ఆయా సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీనటులను రాజమౌళి దీనిలో కీలకపాత్రలకు ఎంపిక చేసుకొన్నారు. రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు అజయ్ దేవగణ్, ఆలియా భట్, కోలీవుడ్, టాలీవుడ్‌ నటులు శ్రియా శరణ్, సముద్రఖని, హాలీవు నటి ఓలివియా మోరిస్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ దుబాయ్‌లో నిర్వహించబోతున్నట్లు దర్శక, నిర్మాతలు రాజమౌళి డీవీవీ దానయ్య ఇదివరకే ప్రకటించారు. 2022, జనవరి 7వ తేదీన సంక్రాంతి పండుగకు ముందు ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.       

సినిమాటోగ్రాఫీ: కె.కేశవరావు సెంథిల్ కుమార్‌, సంగీతం: ఎంఎం కీరవాణి, డిస్ట్రిబ్యూటర్స్: దక్షిణాది రాష్ట్రాలలో లైకా ప్రొడక్షన్స్, ఉత్తరాది రాష్ట్రాలలో పెన్‌ స్టూడియోస్, పెన్ మరూధర్ ఎంటర్‌టైన్‌మెంట్.


Related Post

సినిమా స‌మీక్ష