నాగార్జునకు హీరోయిన్ ఎవరో?

November 19, 2021


img

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా చేయబోతున్నారు. దానిలో హీరోయిన్‌గా మొదట కాజల్ అగర్వాల్‌ను తీసుకోవాలనుకున్నారు. కానీ ఆమె ఇటీవల గర్భవతి అయ్యిందని తెలుసుకొన్న నిర్మాతలు వేరే హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. టాలీవుడ్‌లో నాగార్జున వంటి పెద్ద హీరోతో సినిమా చేసే అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు. కనుక అమలా పాల్‌ను అడిగితే ఆమె చాలా భారీగా డిమాండ్ చేయడంతో నిర్మాతలు షాక్ అయ్యారుట. ఆ తరువాత మెహరీన్ కౌర్‌ని అడిగితే ఆమె కోటి రూపాయలకు తక్కువైతే చేయలేనని తెగేసి చెప్పిందట. నాగార్జునతో సినిమా అంటే ఆ మాత్రం ఇవ్వకపోతే ఎలా? అని ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. కాజల్ అగర్వాల్‌కైతే అంతకంటే ఎక్కువే ఇవ్వాల్సివచ్చేది కనుక మెహరీన్ ఫిర్జాదాతో సరిపెట్టుకొంటారో లేదా వేరే హీరోయిన్ చూసుకోంటారో? ఇంకా తెలియవలసి ఉంది.   Related Post

సినిమా స‌మీక్ష