నాగార్జున 'బ్యాచిలర్' పార్టీ..!

October 23, 2021


img

కింగ్ నాగార్జున ఏంటి ఇప్పుడు బ్యాచిలర్ పార్టీ ఇవ్వడం ఏంటని షాక్ అవ్వొచ్చు. నాగార్జున బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది నిజమే కాని ఆయన ఇచ్చింది తనయుడు అఖిల్ బ్యాచిలర్ సినిమా హిట్ సందర్భంగా పార్టీ ఇచ్చాడు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ ను మూడు సినిమాలు చేసినా కమర్షియల్ గా హిట్ కొట్టని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో వచ్చాడు. దసరా బరిలో నిలిచిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. వారం రోజుల్లో 40 కోట్ల గ్రాస్ కలక్షన్స్ తో కెరియర్ లో తొలి సూపర్ హిట్ అందుకున్నాడు అఖిల్ అక్కినేని.

ఇక వారసుడి మొదటి హిట్ కొట్టిన సందర్భంగా నాగార్జున ఫుల్ ఖుషిగా ఉన్నారని తెలుస్తుంది. అంతేకాదు చిత్రయూనిట్ కు ఓ స్పెషల్ పార్టీ ఇచ్చినట్టు టాక్. బ్యాచిలర్ యూనిట్ మొత్తం నాగార్జున పార్టీలో పాల్గొన్నారని తెలుస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించారు. సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటించింది. Related Post

సినిమా స‌మీక్ష