భీమ్లా నాయక్ కు భారీ ఓటీటీ డీల్..!

October 23, 2021


img

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న క్రేజీ మూవీ భీమ్లా నాయక్. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తుండగా త్రివిక్రం డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో భీమ్లా నాయక్ పై సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఇక లేటెస్ట్ గా ఈ సినిమాకు భారీ ఓటీటీ డీల్ వచ్చినట్టు తెలుస్తుంది.

అమేజాన్ ప్రైం వీడియోస్ నుండి భీమ్లా నాయక్ కు 150 కోట్ల క్రేజీ డీల్ వచ్చినట్టు తెలుస్తుంది. ఆఫర్ అదిరిపోయేలా ఉన్నా మేకర్స్ మాత్రం భీమ్లా నాయక్ ను థియేట్రికల్ రిలీజ్ చేసేలా ఆలోచిస్తున్నారట. 2022 సంక్రాంతి కానుకగా భీమ్లా నాయక్ రిలీజ్ ఎనౌన్స్ చేశారు. అయితే 2022 జనవరి 7న ఆర్.ఆర్.ఆర్ వస్తుండగా జనవరి 14న రాధే శ్యాం అంటూ ప్రభాస్ దిగుతున్నాడు. మరి ఈ రెండు సినిమాల మధ్యలో భీమ్లా నాయక్ వస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. Related Post

సినిమా స‌మీక్ష