ప్రభాస్ రాధే శ్యామ్ టీజర్..!

October 23, 2021


img

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. 2022 జనవరి 14న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా టీజర్ ను లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాధే శ్యామ్ విక్రమాదిత్య పాత్రని పరిచయం చేశారు.

సినిమాలో విక్రమాదిత్య పాత్రలో కనిపించనున్నాడు ప్రభాస్. సినిమాలో ప్రభాస్ జ్యోతిష్యుడుగా నటిస్తున్నాడు. పీరియాడికల్ లవ్ స్టోరీగా వస్తున్న రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచాయి. నీ గురించి నాకు అన్ని తెలుసు.. నేను దేవుడిని కాదు.. నేను మీలా సాధారణ మీలో ఒకడిని కూడా కాదు అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. 

సినిమాలో ప్రభాస్, పూజా హెగ్దేల రొమాన్స్ హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. విక్రమాదిత్య, ప్రేరణ లవ్ స్టోరీగా వస్తున్న రాధే శ్యామ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Related Post

సినిమా స‌మీక్ష