సంక్రాంతికి బంగార్రాజు..?

October 20, 2021


img

కింగ్ నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా బంగార్రాజు. ఈ సినిమాలో నాగార్జునతో పాటుగా నాగ చైతన్య కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే. చైతుకి జోడీగా ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈమధ్యనే షూటింగ్ మొదలు పెట్టిన ఈ బంగార్రాజు సినిమాను 2022 సంక్రాంతి రేసులో దించాలని చూస్తున్నారు నాగార్జున. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు ప్రాక్వల్ గా వస్తున్న ఈ సినిమా ఆ సెంటిమెంట్ తోనే ఆ మూవీ రిలీజైన సంక్రాంతికే దీన్ని రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

బంగార్రాజు సినిమాలో నాగార్జున తన పంచెకట్టు.. తన డైలాగ్ డెలివరీతో అలరిస్తారని తెలుస్తుంది. మనం తర్వాత చైతు, నాగ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కొన్నాళ్లుగా బంగారాజు సినిమా గురించి వెయిట్ చేసిన కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాతో హిట్ కొట్టి సత్తా చాటాలని చూస్తున్నాడు. 



Related Post

సినిమా స‌మీక్ష