చేనేత గొప్పతనాన్ని చెప్పే సినిమా : కేటీఆర్‌

October 13, 2021


img

ఆనంద్ రాజ్, శ్రావణి శెట్టి జంటగా బడుగు విజయ్ కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా తమసోమా జ్యోతిర్గమయ. ఈ సినిమా ట్రైలర్ ను తెలంగాణా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ రిలీజ్ చేశారు. చేనేత వృత్తితో ఎన్నో ఆవిష్కరణలు రావాలని.. అందుకు ఇలాంటి సినిమాలు దోహదపడతాయని కేటీఆర్‌ అన్నారు. చేనేత వృత్తిలోని కష్టాలు.. కన్నీళ్లని మాత్రమే కాదు చేనేత గొప్పదనాన్ని చాటి చెబుతుందని.. యువత ఈ రంగ వైపు అడుగు వేసేలా చేస్తుంది.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు కేటీఆర్‌. 


విమల్ క్రియేషన్స్ బ్యానర్ లో తడక రమేష్ ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమాను అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. తమసోమా జ్యోతిర్గమయ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. 
Related Post

సినిమా స‌మీక్ష