'మా' కొత్త ప్రెసిడెంట్ డ్యూటీ ఎక్కాడు..!

October 13, 2021


img

రీసెంట్ గా జరిగిన మా ఎలక్షన్స్ లో గెలిచిన మంచు విష్ణు బుధవారం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. మాజీ ప్రెసిడెంట్ నరేష్ బాధ్యతలను విష్ణుకి అప్పగించంచారు. ఇక మా అధ్యక్షుడిగా డ్యూటీ ఎక్కిన మంచు విష్ణు తన తొలి సంతకాన్ని మా సభ్యుల పెన్షన్ ఫైల్ పై చేశారని తెలుస్తుంది. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తానని ఈ సందర్భంగా విష్ణు చెప్పారు. 

మా ఎలక్షన్స్ లో ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు హోరాహోరీ పోటీ జరిగింది. ప్రకాష్ రాజ్ పై నాన్ లోకల్ అస్త్రం సంధించిన మంచు విష్ణు ఆ విషయంలో తెలుగు నటీనటుల సపోర్ట్ పొంది మా అధ్యక్షుడిగా విజయం అందుకున్నారు. అయితే ప్రకాష్ రాజ్ టీం తరపున గెలిచిన ఈసీ మెంబర్స్ కూడా తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వారి రాజీనామాలపై మా నూతన అధ్యక్షుడు స్పందించాల్సి ఉంది.Related Post

సినిమా స‌మీక్ష