అనసూయ మరో ఐటం సాంగ్..!

October 13, 2021


img

జబర్దస్త్ యాంకర్ అనసూయ ఓ పక్క స్మాల్ స్క్రీన్ పై సత్తా చాటుతూనే సిల్వర్ స్క్రీన్ పై వెరైటీ పాత్రలతో అలరిస్తుంది. సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ అలరిస్తున్న అనసూయ అడపాదడపా స్పెషల్ సాంగ్స్ లో కూడా అలరిస్తుంది. ఇప్పటికే అనసూయ రెండు మూడు స్పెషల్ సాంగ్స్ చేయగా లేటెస్ట్ గా మరో స్పెషల్ ఐటం సాంగ్ కు సైన్ చేసిందని తెలుస్తుంది. 

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో వస్తున్న సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ చేస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం రవితేజ నటించిన ఖిలాడి రిలీజ్ కు రెడీ అవుతుండగా మరో సినిమా రామారాజు కూడా సెట్స్ మీద ఉంది. క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ రాబోతున్న ఈ సినిమాలతో కూడా సత్తా చాటాలని చూస్తున్నాడు. Related Post

సినిమా స‌మీక్ష