ప్రకాష్ రాజ్ 'ఆత్మ'.. ఇండస్ట్రీ లో హాట్ టాపిక్..!

October 13, 2021


img

మా ప్రెసిడెంట్ గా ఓడిన ప్రకాష్ రాజ్ వేరు కుంపటి పెడుతున్నాడంటూ ప్రచారం మొదలైంది. మా అధ్యక్షుడిగా ఓడిన ప్రకాష్ రాజ్ మరుసటి రోజే ప్రెస్ మీట్ పెట్టి మరి మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రకాష్ రాజ్ ఓడిపోవడానికి ప్రధాన కారణంగా నాన్ లోకల్ అంశం బలంగా వినపడింది. 21 ఏళ్లుగా మా సభ్యుడిగా తెలుగు సినిమాల్లో నటిస్తున్న తనని నాన్ లోకల్ అని పిలవడం ప్రకాష్ రాజ్ బాగా హర్ట్ అయ్యాడు.

అయితే ఇదే ఆవేశంలో మరో మాని తయారు చేస్తున్నాడని.. దాని పేరు ఆత్మ (All  Telugu Movie Artist Association) అని మీడియాలో వార్తలో వచ్చాయి. మంగళవారం జరిగిన ప్రెస్ మీట్ లో ప్రకాష్ రాజ్ ఆత్మ.. పరమాత్మ.. ప్రేతాత్మలు లాంటి ఆలోచనలు లేవని చెప్పారు. అయినా సరే మీడియా ప్రకాష్ రాజ్ ఆత్మపై కథనాలు ప్రసారం చేస్తూనే ఉంది. మా కు వ్యతిరేకంగా ప్రకాష్ రాజ్ మరో అసోసియేషన్ ఏర్పాటు చేస్తారని. ముందు అలాంటిది ఏది లేదని చెప్పినా సరే త్వరలో దాని గురించి బయటకు వస్తుందని అంటున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష