మొదటి సినిమా 100 కోట్లు.. రెండో సినిమా 5 కోట్లు..!

October 13, 2021


img

మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి సినిమా ఉప్పెన సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్ ఆ సినిమాతో 100 కోట్ల గ్రాస్ కలక్షన్స్ రాబట్టాడు. అఫ్కోర్స్ ఆ సినిమాలో డైరక్టర్ బుచ్చి బాబు టాలెంట్.. కృతి శెట్టి గ్లామర్ సినిమాకు ప్లస్ అయ్యయ్యి అనుకోండి. ఇక మొదటి సినిమా 100 కోట్ల దాకా రాబట్టిన మెగా హీరో రెండో సినిమా కొండపొలంతో 5 కోట్లను రాబట్టాడు.

క్రిష్ డైరక్షన్ లో కొండపొలం నవల ఆధారంగా వచ్చిన ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ తో రకుల్ ప్రీత్ సింగ్ జోడీ కట్టింది. ఈ సినిమా మొదటి షో టాక్ బాగున్నా ఆ తర్వాత పెద్దగా టాక్ రాలేదు. ఇక కలక్షన్స్ కూడా 5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిది. మొదటి సినిమా 100 కోట్ల గ్రాస్ తో సూపర్ అనిపించుకున్న వైష్ణవ్ తేజ్ సెకండ్ సినిమా 5 కోట్ల గ్రాస్ తో షాక్ ఇచ్చాడు. క్రిష్ డైరక్షన్ లో అనగానే ఏమాత్రం ఆలోచించకుండా సినిమా చేసిన వైష్ణవ్ తేజ్ కు పెద్ద షాక్ తగిలిందని చెప్పొచ్చు.


Related Post

సినిమా స‌మీక్ష