సమంత మిస్ చేసుకున్న 'మహా' ఆఫర్..!

October 13, 2021


img

ఆరెక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అజయ్ భూపతి హీరోయిన్ ను నెగటివ్ క్యారక్టర్ చేసి ఆ సినిమాతో తన సత్తా చాటాడు. ఇక తన నెక్స్ట్ సినిమా మహా సముద్రం సినిమాతో కూడా మరోసారి తన టాలెంట్ చూపించేందుకు వస్తున్నాడు. శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ మూవీలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటించారు. సినిమాలో మహా పాత్రలో అదితి రావు హైదరి నటిస్తుంది. 

సినిమా  ప్రమోషన్స్ లో భాగంగా మహా పాత్ర కోసం ముందు తాను సమంతని అనుకున్నానని అన్నారు అజయ్ భూపతి. కొన్ని కారణాల వల్ల సమంత చేయలేకపోవడంతో ఆమె ప్లేస్ లో అదితి రావు హైదరిని ఫిక్స్ చేసినట్టు చెప్పారు. అయితే మహా సముద్రం కథ మొత్తం మహా పాత్ర చుట్టే తిరుగుతుందని తెలుస్తుంది. మరి అలాంటి పాత్రని సమంత ఎందుకు మిస్ చేసుకుందో తెలియాల్సి ఉంది.Related Post

సినిమా స‌మీక్ష