మోహన్ బాబు బూతులు తిట్టారు.. కొట్టడానికి వచ్చారు..!

October 12, 2021


img

మా ఎలక్షన్స్ రోజు మోహన్ బాబు బెనర్జీ మీద అరిచినట్టు కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత అలాంటిదేమి లేదని మీడియాని కవర్ చేసేందుకు చెప్పినా సరే అసలు మ్యాటర్ ఈరోజు బయటకు వచ్చింది. డీ.ఆర్.సీ పెద్ద మనిషి గొడవ జరిగితే ఆపాలి కాని కాని అలాంటిది ఆయనే తనని అర్ధ గంట పాటు బూతులు తిట్టారు.. కొట్టడానికి వచ్చారని అన్నారు బెనర్జీ. 

గెలిచిన ఆనందం లేదని.. అందరు తనకి అభినందనలు చెబుతున్నా అది మనసులో ఉందని అన్నారు బెనర్జీ. వందల మందిలో తనని మోహన్ బాబు బూతులు తిట్టారని ఎమోషనల్ అయ్యారు బెనర్జీ. 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా ఇంత అవమానం ఎప్పుడూ జరగలేదని అన్నారు. తనతో పాటుగా తన ఫ్యామిలీ కూడా ఈ విషయంపై బాధపడిందని అన్నారు. మంచు విష్ణు, మనోజ్ సర్ధి చెప్పారని.. మోహన్ బాబు భార్య కూడా ఫోన్ చేసి మాట్లాడారని అన్నారు. మొత్తానికి మోహన్ బాబు ఆరోజు చేసిన రచ్చ ఈరోజు బయటకు వచ్చింది.  

ఇదే విషయం గురించి తనీష్ కూడా చెప్పాడు. కౌంటింగ్ టైం లో మోహన్ బాబు బూతులు తిట్టారని.. తనని చేయి కూడా చేసుకున్నారని అన్నారు. తన కోసం వచ్చిన బెనర్జీని దారుణంగా తిట్టారని.. తనకు చాలా బాధ వేసిందని ఆ టైం లో తాను ఏడ్చేశానని అన్నారు తనీష్. ఆ తర్వాత విష్ణు, మనోజ్ లు వచ్చి సర్ధి చెప్పారని.. మోహన్ బాబు అమ్మని తిడుతూ మాట్లాడటం మర్చిపోలేమని అన్నారు. తనకు అమ్మే సర్వస్వమని.. దెబ్బ మానినా గాయం గుర్తు అలానే ఉంటుందని అన్నారు తనీష్.  Related Post

సినిమా స‌మీక్ష