'మా' పదవులకు రాజీనామా.. ప్రకాష్ రాజ్ ప్యానల్ నిర్ణయం..!

October 12, 2021


img

 మా ఎలక్షన్స్ లో ప్రకాష్ రాజ్ ప్యానల్ వర్సెస్ మంచు విష్ణు ప్యానల్ ల మధ్య గట్టి పోటీ ఏర్పడింది. అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలవగా.. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి 11 మంది సభ్యులు గెలిచారు. ముందునుండి ఒకటే ప్యానల్ గెలిస్తే అభివృద్ధి అవుతుందని చెబుతున్నామని.. ఇప్పుడు వేరే ప్యానల్ తో కలిసి పనిచేయడం కష్టమని ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి గెలిచిన సభ్యులు చెబుతున్నారు.

ఇదివరకు జరిగిన విషయాలను దృష్టిలో ఉంచుకుని తామంతా మా పదవులకు రాజీనామా చేస్తున్నామని ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు ప్రకాష్ రాజ్ ప్యానల్ తరపున గెలిచిన సభ్యులు. ఇందులో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్, వైఎస్ ప్రెసిడెంట్ బెనర్జీ, జాయింట్ సెక్రెటరీ ఉత్తేజ్ ఇంకా పలువురు ఈసీ మెంబర్స్ కూడా ఉన్నారు. వీరంతా తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక పదవులకు రాజీనామా చేసినా మా అభివృద్ధి కోసం.. తమని ఓటేసి గెలిపించిన వారి కోసం మా ప్రెసిడెంట్ ను ప్రశ్నిస్తామని అంటున్నారు. 

ఇక మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ప్రకాష్ రాజ్ తాను అది వెనక్కి తీసుకోవాలి అంటే మంచు విష్ణు బైలాస్ మార్చి తెలుగు వాడు కాని వారు కూడా పోటీ చేసేలా హామీ ఇవ్వాలని అన్నారు. అలా చేస్తేనే తన రిజిగ్నేషన్ ను వెనక్కి తీసుకుంటానని అన్నారు. మొత్తానికి మా ఎలక్షన్స్ వేడి ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చిన తర్వాత కూడా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. అయితే ప్రకాష్ రాజ్ ప్యానల్ లో గెలిచిన సభ్యుల  పదవులకు రాజీనామా చేయడంతో ప్రస్తుతానికి గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టినా తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.

ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ కొత్త అసోసియేషన్ పెడుతున్నాడని.. దాని పేరు ఆత్మ (All Telugu Movie Artist Association)  అని ఆఫ్టర్నూన్ నుండి మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఈ వార్తలపై కూడా స్పందించిన ప్రకాష్ రాజ్ ఆత్మ.. పరమాత్మ.. ప్రేతాత్మ లాంటి ఆలోచనలు ఏమి లేవని చెప్పారు. 




Related Post

సినిమా స‌మీక్ష