రెండు రాష్ట్రాల సిఎం లకు నాగార్జున రిక్వెస్ట్..!

September 28, 2021


img

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రిక్వెస్ట్ చేశారు. తెలుగు వారికి సినిమా అంటే ప్రేమ.. సినీఎ పరిశ్రమకి మద్ధతు ఇవ్వాలని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్ధించారు నాగార్జున. 2020 మార్చ్ నుండి కరోనాతో పోరాడుతూనే ఉన్నాం. ఒక వేవ్ వచ్చి వెళ్లింది అనుకేలోగా.. సెకండ్ వేవ్ వచ్చి దెబ్బ తీసింది. ఇప్పుడిప్పుడే దాన్నుంచి బయటపడుతున్నాం. కరోనా టైం లో ఏపీ సీ.ఎం జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణా సీ.ఎం కె.సి.ఆర్ సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల కరోనా ప్రభావం తగ్గింది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశమంతటా కొవిడ్ మరణాలు తగ్గుతున్నాయి. దానికి మనం సెలబ్రేట్ చేసుకోవాలని అన్నారు. 

టాలీవుడ్ కే కాదు అన్ని చిత్ర పరిశ్రమలకు లవ్ స్టోరీ ధైర్యాన్ని ఇచ్చింది. మంచి సినిమా తీస్తే.. మేం థియేటర్లకు వస్తాం అని మరోసారి తెలుగు ప్రేక్షకులు నిరూపించారు. సెన్సిటివ్ డైరక్టర్ శేఖర్ కమ్ముల ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. ఏయన్నార్ ప్రేం నగర్ 50 ఏళ్ల క్రితం సెప్టెంబర్ 24న రిలీజై సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు నాగ చైతన్య లవ్ స్టోరీ అదే డేట్ న వచ్చి సూపర్ హిట్ అయ్యింది. లవ్ స్టోరీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక క్లాసిక్ గా నిలుస్తుందని అన్నారు నాగార్జున. స్టార్, యాక్టర్ రెండూ వేరు.. నాగ చైతన్యని ఈ సినిమాతో స్టార్ యాక్టర్ గా చేసినందుకు థ్యాంక్స్ అన్నారు. తెలుగు వారికి సినిమాల అంటే ప్రేమ.. సినీ పరిశ్రమ చల్లగా చూడాలని తెలుగు రాస్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్నా.. పరిశ్రమకు మద్ధతు ఇస్తారని కోరుకుంటున్నా అని అన్నారు నాగార్జున.Related Post

సినిమా స‌మీక్ష