'మా'నామినేషన్స్ లో మంచు విష్ణు తెలుగు వాదం..!

September 28, 2021


img

మూవీ ఆర్టిస్ట్ అసొసియేషన్ ఎన్నికల సందర్భంగా మంగళవారం మంచు విష్ణు నామినేషన్ వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంచు విష్ణు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కాకుండ తెలుగు సినిమా నిర్మాతల మండలి వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నా అని అన్నారు. బండ్ల గణేష్ నైట్ పార్టీలు, గిఫ్టులు ఇస్తున్నట్టు చెబుతున్నారు. రాత్రి పార్టీలకు నేను వెళ్లను.. బండ్ల గణేష్ గారు ఇస్తే తాను స్వీకరిస్తాను అని అన్నారు మంచు విష్ణు. 

పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను నిర్మాతల మండలి వ్యతిరేకించింది. అయితే సినిమా ఇండస్ట్రీ అంతా పవన్ వుఖ్యలను వ్యతిరేకించారు. ప్రకాష్ రాజ్ సినిమా ఇండస్ట్రీ వైపు ఉంటాఅ లేక పవన్ కళ్యాణ్ గారి వైపు ఉంటారా అన్నది తెలియచేయాలని ప్రశ్నించారు మంచు విష్ణు. మేనిఫెస్టో తర్వాత చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారి మద్ధతు తనకే ఉంటుందని అన్నారు మంచు విష్ణు. మాలో ఉన్న 900 మంది సభ్యుల మద్ధతు తనకు ఉండటం వల్లే ఈరోజు మీ ముందుకు వచ్చనని అన్నారు. ఈ క్రమంలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న బాబు మోహన్ మాది బలమైన ప్యానల్ అని.. మాది తెలుగు ప్యానల్ అని.. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలిపే ప్యానల్ అని గట్టిగా చెప్పారు. ప్రకాష్ రాజ్ తెలుగు వాడు కాదని చెబుతూ తెలుగు వారు ఆత్మగౌరవ ప్యానల్ అంటూ మంచు విష్ణు ప్యానల్ ప్రచారం సాగిస్తుంది. అక్టోబర్ 10న జరుగనున్న ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారన్నది చూడాలి.

 


Related Post

సినిమా స‌మీక్ష