మహా సముద్రం ఓటీటీ డీల్ క్లోజ్..!

September 28, 2021


img

ఆరెక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అజయ్ భూపతి తన నెక్స్ట్ సినిమా శర్వానంద్, సిద్ధార్థ్ కాంబినేషన్ లో మహా సముద్రం అనే మల్టీస్టారర్ సినిమాతో వస్తున్నారు. ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటించారు. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ సినిమా అక్టోబర్ 14న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. 

సినిమాను నెట్ ఫ్లిక్స్ భారీ రేటుకి కొనేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్. థియేట్రికల్ రిలీజ్ అయిన 4 వారాల తర్వాత మహా సముద్రం ఓటీటీ రిలీజ్ అవుతుందట. శర్వానంద్, సిద్ధార్థ్ ఇద్దరు మహా సముద్రం సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష