పోసాని వర్సెస్ పవన్.. ముదురుతున్న వివాదం..!

September 28, 2021


img

సాయి ధరం తేజ్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ సోమవారం పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రెండు చోట్లు నిలబడ్డా గెలవలేదంటూ రాజకీయ నాయకుడిగా పవన్ ఫెయిల్ అనేసిన పోసాని ఒక పంజాబి అమ్మాయిని ఓ పవర్ ఫుల్ వ్యక్తి అన్యాయం చేశాడు. ఆమెకు న్యాయం చేసి నువ్వు హీరో అనిపించుకో.. నేను నీకు గుడి కడతా అని అన్నారు. అంతటితో ఆగకుండా పవన్ ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పోసాని ప్రెస్ మీట్ తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అతన్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ప్రెస్ క్లబ్ లో పోసాని మరోసారి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ చేత తనని తన ఫ్యామిలీని టార్గెట్ చేయించారని అన్నారు. నిన్న రాత్రి నుండి బూతులతో ఫోన్లు, అసభ్యకరంగా మెసేజ్ లు చేస్తూ టార్చర్ చేస్తున్నారని అన్నారు పోసాని. పవన్ ఒక సైకో అని.. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని ఫ్యాన్స్ చేత టార్గెట్ చేయిస్తున్నారని అన్నారు. 

అంతేకాదు తన భార్యని అన్నందుకు పోసాని కూడా పవన్ భార్య, పిల్లల మీద అసభ్యకరంగా మాట్లాడారు. ప్రెస్ మీట్ జరుగుతున్న టైం లోనే తెలంగాణా జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అక్కడకు భారీగా వచ్చారు. పరిస్థితి కంట్రోల్ లో తెచ్చేందుకు పోలీసులు పోసానిని సొంత వెహికల్ లో కాకుండా వేరే వెహికల్ లో ఇంటికి పంపించారు. 

వైసీపీ ప్రభుత్వం తన మీద ఉన్న కోపం ఇండస్ట్రీ మీద చూపిస్తుందనే ఉద్దేశంతో వైసీపీ నేతలను సన్నాసులు, వెధవలు అనేస్తూ రిపబ్లిక్ ఈవెంట్ లో ఫైర్ అయ్యాడు పవన్ కళ్యాణ్. సినిమా ఈవెంట్ లో రాజకీయాలు మాట్లాడటం కరెక్ట్ కాదు. కాని పవన్ చేతనైతే తన సినిమాలు ఆపుకోండి కాని ఇండస్ట్రీ గురించి ఆలోచించండి అని అన్నారు. పవన్ ఎప్పుడైతే వైసీపీ నేతలపై, ఏపీ ప్రభుత్వంపై రియాక్ట్ అయ్యారో పవన్ మీద కూడా వైసీపీ నేతలు సంచలన కామెంట్స్ చేస్తున్నారు.

Related Post

సినిమా స‌మీక్ష