ప్రముఖ నిర్మాత RR వెంకట్ మృతి..!

September 27, 2021


img

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఆర్.ఆర్ వెంకట్ సోమవారం ఉదయం 5:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా కిడ్నీ సంబందిత వ్యాధితో బాధపడుతున్న వెంకట్ గచ్చిబౌలిలోని ఏ.ఐ.జీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందారు. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ పై వెంకట్ సినిమాలు నిర్మించారు. ఆర్.ఆర్ వెంకట్ పూర్తి పేరు జె.వి. ఎంకట్ ఫణీంద్ర రెడ్డి.  సామాన్యుడు ఆంధ్రావాలా, డమరుకం, కిక్, ఆటోనగర్ సూర్య, మిరపకాయ్, బిజినెస్ మెన్, పైసా, పూలరంగడు, ది ఎండ్ , మాయాజాలం, గుండమ్మగారి మనవడు, బహుమతి, ప్రేమ కావాలి, డాన్ శ్రీను, లవ్లీ, విక్టరీ, హంగామా సినిమాలు నిర్మించారు ఆర్.ఆర్ వెంకట్. హాలీవుడ్ లో కూడా డివొర్స్ ఇన్విటేషన్ అనే సినిమా నిర్మించారు వెంకట్.



Related Post

సినిమా స‌మీక్ష