విజయ్ దేవరకొండ 'లైగర్' లో మైక్ టైసన్..!

September 27, 2021

img

పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమా లైగర్. అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తుంది. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్ సినీ లవర్స్ ను షాక్ అయ్యేలా చేస్తుంది. సినిమాలో బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ నటిస్తున్నట్టు ప్రకటించారు చిత్రయూనిట్. బాక్సింగ్ అంటే మైక్ టైస అలాంటి టైసన్ బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుంద్ది.

ఇండియన్ స్క్రీన్ మీద మొదటిసారి టైసన్ ను తెరకు పరిచయం చేస్తున్నారు పూరీ జగన్నాథ్. లైగర్ సినిమాకు విజయ్ తో పాటుగా మైక్ టైసన్ కూడా వన్ ఆఫ్ ది స్పెషల్ ఎట్రాక్షన్ అవుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు.

Get the Fireworks ready 🔥🔥🔥
2022!https://t.co/bYsuZFwCMQ #NamasteTYSON #LIGER pic.twitter.com/MqgcbNS4j7
— Vijay Deverakonda (@TheDeverakonda) September 27, 2021

Related Post

సినిమా స‌మీక్ష