కొండపొలం ట్రైలర్.. వైష్ణవ్ తేజ్ సూపర్ అటెంప్ట్..!

September 27, 2021


img

ఉప్పెన సినిమాతో మొదటి సినిమానే సెన్సేషనల్ హిట్ అందుకున్న మెగా హీరో వైష్ణవ్ తేజ్ తన సెకండ్ సినిమా క్రిష్ డైరక్షన్ లో చేసిన విషయం తెలిసిందే. కొండపొలం నవల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాకు అదే టైటిల్ ను ఫిక్స్ చేశారు. వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సిన్మా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.

వైష్ణవ్ తేజ్ సెకండ్ సినిమా కూడా ఒక ప్రయోగాన్ని చేశాడని చెప్పొచ్చు. క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు ఎం.ఎం కీరవాణి మ్యూజిక్ అందించారు. అక్టోబర్ 8న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలి. 





Related Post

సినిమా స‌మీక్ష