దసరా టైటిల్ తో నాని..!

September 17, 2021


img

నాచురల్ స్టార్ నాని టక్ జగదీష్ అంటూ ఈమధ్యనే వచ్చి ప్రేక్షకులను అలరించాడు. మరోపక్క రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న శ్యాం సింగ రాయ్ షూటింగ్ పూర్తి చేసిన నాని తన నెక్స్ట్ సినిమా వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో అంటే సుందరానికీ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం అంటే సుందరానికీ సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమా తర్వాత నాని సుకుమార్ అసిస్టెంట్ శ్రీకాంత్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని టాక్. ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు చెప్పుకుంటున్నారు.

నాని సినిమాకు దసరా అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తుంది. టైటిల్ ను బట్టే ఆ సినిమా తప్పకుండా పండుగ లాంటి సినిమా అవుతుందని చెప్పొచ్చు. వి, టక్ జగదీష్ రెండు సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయగా ఇక మీదట తన సినిమాలు ఓటీటీ రిలీజ్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు నాని.Related Post

సినిమా స‌మీక్ష