కొత్త దర్శకుడితో సమంత..!

September 17, 2021


img

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి తర్వాత సినిమాల సెలక్షన్ విషయంలో జాగ్రత్త పడుతుంది. రంగస్థలం, ఓ బేబీ, జాను లాంటి సినిమాలతో సత్తా చాటిన సమంత ప్రస్తుతం గుణశేఖర్ డైరక్షన్ లో శాకుంతలం సినిమా చేస్తుంది. కెరియర్ లో ఫస్ట్ టైం మైథలాజికల్ మూవీ చేస్తున్న సమంత మరోసారి తన నటనతో ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేస్తుందని అంటున్నారు. ఈ సినిమాతో పాటుగా తమిళ సినిమా కూడా చేస్తుంది సమంత. విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది సామ్.

ఇక లేటెస్ట్ గా తెలుగులో మరో సినిమాకు ఓకే చెప్పిందట సమంత. నూతన దర్శకుడు చెప్పిన కథ నచ్చి సమంత సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కొత్త దర్శకుడు లేడీ ఓరియెంటెడ్ కథతో సమంతని ఇంప్రెస్ చేసినట్టు టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన డీటైల్స్ బయటకు వస్తాయి.Related Post

సినిమా స‌మీక్ష