లవ్ స్టోరీ గెస్టులుగా చిరు, నాగ్..!

September 17, 2021


img

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఏసియన్ సినిమాస్ బ్యానర్ లో సునీల్ నారంగ్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 24న రిలీజ్ అవుతుంది. సాంగ్స్ తో ఇప్పటికే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టార్స్ ను గెస్టులుగా ఇన్వైట్ చేస్తున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి అటెండ్ అవుతారని తెలుస్తుంది.

ఇక తనయుడి సినిమా ఈవెంట్ కు నాగ్ రాకుండా ఉంటాడా. లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరు, నాగ్ లు స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నారు. సినిమాలో సాయి పల్లవి కూడా ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు. ఈమధ్య వచ్చిన ట్రైలర్ కూడా అంచనాలు పెంచగా లవ్ స్టోరీ కు ఏర్పడిన బజ్ కి తగినట్టుగా సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష