లవ్ స్టోరీ సెన్సార్ పూర్తి..!

September 15, 2021


img

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వస్తున్న సినిమా లవ్ స్టోరీ. సెప్టెంబర్ 24న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమాకు సెన్సార్ వారు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. సెన్సార్ టీం నుండి సినిమాకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ట్రైలర్ తో అంచనాలు పెంచిన లవ్ స్టోరీ సినిమా నాగ చైతన్య కెరియర్ లో మరో హిట్ సినిమాగా నిలిచేలా ఉంటుందని చెబుతున్నారు.


నాగ చైతన్య ఇప్పటికే మజిలీ, వెంకీ మామ సినిమాలతో హిట్ కొట్టగా లవ్ స్టోరీతో హ్యాట్రిక్ అందుకోవాలని చూస్తున్నాడు. శేఖర్ ఖమ్ముల తన మార్క్ మూవీగా లవ్ స్టోరీని తెరకెక్కించాడని తెలుస్తుంది. సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష