టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఈడీ విచారణలో పాల్గొన్న నవదీప్..!

September 13, 2021


img

టాలీవుడ్ డ్రగ్స్ కేసు విషయంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హీరో నవదీప్ తో పాటు ఎఫ్ లాంజ్ పబ్బు జనరల్ మేనేజర్ ను కూడా విచారించారు. ఎఫ్ లాంజ్ పబ్ చుట్టూ ఉచ్చు బిగుస్తుందని తెలుస్తుంది. 2015-17 మధ్య కాలంలో పెద్ద ఎత్తున ఎఫ్ లాంజ్ పబ్ లో పార్టీలు జరగడం.. ఆ పార్టీలకు పలువురు నటీనటులు జారవడం గుర్తించారు. ఈ పార్టీ టైం లో పెద్ద ఎత్తున క్లబ్ ఖాతాలోకి భారీగా నగదు బదిలీలు జరిగినట్టు సమాచారం. కొంతమంది నటీనటులు పెద్ద ఎత్తున క్లబ్ మేనేజర్ కి డబ్బులు పంపించినట్టు తెలుస్తుంది. 

నవదీప్ ను మనీ ల్యాండరింగ్ నిబంధనల ఉల్లఘనపై ఈడీ ప్రశ్నించింది. ఎఫ్ క్లబ్ వేదిక ద్వారా డ్రగ్స్ ఆర్ధిక లావాదేవీలు జరిగినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్ క్లబ్ కు సంబందించిన వివరాలు సేకరించారని తెలుస్తుంది. కెల్విన్, జిషాన్ లు కలిసి పార్టీలకు సంబంధించిన వ్యవహారాలను నడిపినట్టు గుర్తించారు. 

 


Related Post

సినిమా స‌మీక్ష