బాలకృష్ణ, గోపీచంద్ సినిమాకు మాస్ టైటిల్..!

September 13, 2021


img

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను డైరక్షన్ లో అఖండ తర్వాత చేస్తున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని బాలయ్య బాబుతో అంతకుమించి అనిపించేలా సినిమా చేస్తాడని టాక్. ఈ సినిమా కూడా ఊర మాస్ కథతో వస్తుందని తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా సినిమా టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

సినిమాకు టైటిల్ గా రౌడీయిజం అని అనుకుంటున్నారట. ఇదేదో ఆర్జీవి సినిమా టైటిల్ లా ఉందని అనుకోవచ్చు. మాస్ డైరక్టర్ గా తనకంటూ ఒక సెపరేట్ స్టైల్ ఏర్పరచుకున్న గోపీచంద్ మాస్ కు కేరాఫ్ అడ్రెస్ అయిన బాలయ్య బాబుతో ఎలాంటి సినిమా చేస్తాడో అని నందమూరి ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు. Related Post

సినిమా స‌మీక్ష