సందీప్ కిషన్ గల్లీ రౌడీ ట్రైలర్ రిలీజ్..!

September 13, 2021


img

జి నాగేశ్వర్ రెడ్డి డైరక్షన్ లో యువ హీరో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన సినిమా గల్లీ రౌడీ. ఎంవివి బ్యానర్ లో ఎంవివి సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు కోనా వెంకట్ సహ నిర్మాతగా ఉన్నారు. ఈ నెల 17న థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేసిన గల్లీ రౌడీ ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా రిలీజ్ చేశారు. వరుస సినిమాలైతే చేస్తున్నా సరైన సక్సెస్ లు లేక కెరియర్ లో వెనకపడ్డాడు సందీప్ కిషన్.

ఈమధ్యనే A1 ఎక్స్ ప్రెస్ అంటూ ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాతో వచ్చాడు. ఆ సినిమా కూడా కమర్షియల్ గా నిరాశపరచింది. ఇక మాస్ ఎంటర్టైనర్ గా ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీగా గల్లీ రౌడీ వస్తుంది. సినిమాలో కోలీవుడ్ క్రేజీ యాక్టర్ బాబీ సిం హా కూడా నటిస్తున్నారు. సందీప్ కిషన్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. మరి ఈ గల్లీ రౌడీతో అయినా సందీప్ కిషన్ అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాడో లేదో చూడాలి. సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.

Related Post

సినిమా స‌మీక్ష