సాయి ధరం తేజ్ హెల్త్ స్టేటస్..!

September 13, 2021


img

మెగా మేనల్లుడు స్టార్ హీరో సాయి ధరం తేజ్ శుక్రవారం రాత్రి బైక్ ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సాయి ధరం తేజ్ కు కాలర్ బోన్ సర్జరీ జరిగినట్టు సమాచారం. సర్జరీ కూడా సక్సెస్ అయ్యినట్టు తెలుస్తుంది. సాయి ధరం తేజ్ వెంటిలేటర్ మీద ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. 


సోమవారం అపోలో డాక్టర్స్ సాయి ధరం తేజ్ హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు. సాయి ధరం తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఇంకా కొన్ని రోజులు ఐసియూలోనే ఉండాల్సి ఉందని అన్నారు. వెంటిలేటర్ ప్రక్రియ తొలగించడం ప్రారంభించామని ప్రకటించారు. సాయి ధరం తేజ్ త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులు పూజలు, పార్ధనలు చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. Related Post

సినిమా స‌మీక్ష