మెగా హీరో సాయి ధరం తేజ్ కు రోడ్ యాక్సిడెంట్..!

September 11, 2021


img

మెగా హీరో.. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరం తేజ్ కు రోడ్ యాక్సిడెంట్ జరిగింది. శుక్రవారం రాత్రి కేబుల్ బ్రిడ్జ్ మీద స్పోర్ట్స్ బైక్ మీద వెళ్తున్న సాయి ధరం తేజ్ బైక్ స్కిడ్ అవడంతో అదుపుతప్పి బైక్ రోడ్ మీద పల్టీకొట్టింది. వెంటనే అక్కడ ఉన్న వారు 108 కి కాల్ చేసి సమాచారం అందించగా సాయి ధరం తేజ్ ను మెడికవర్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ నుండి అపోలో హాస్పిటల్ కు తీసుకెళ్లారు.

సాయి ధరం తేజ్ ప్రమాదం గురించి తెలుసుకున్న చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగ బాబు, వరుణ్ తేజ్, నిహారిక, వైష్ణవ్ తేజ్, అల్లు అరవింద్. మిగతా మెగా ఫ్యామిలీ మొత్తం శుక్రవారం రాత్రికే హాస్పిటల్ కు చేరుకున్నారు. అయితే లైఫ్ రిస్క్ లేదని డాక్టర్లు చెబుతున్నా 48 గంటలు గడిస్తేనే ఏదైనా చెప్పగలం అని డాక్టర్లు అంటున్నారు. మెగా ఫ్యామిలీ మాత్రం సాయి ధరం తేజ్ కోలుకుంటున్నారని చెప్పారు. ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదని అన్నారు.      

యాక్సిడెంట్ కు కారణం స్పీడ్ గా బైక్ నడపడమే అని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో రాష్ డ్రైవింగ్ కారణంగా సాయి ధరం తేజ్ మీద ఐపీసీ 336 పై కేసు నమోదు చేశారు. యాక్సిడెంట్ టైం లో సాయి ధరం తేజ్ హెల్మెంట్ ధరించడం వల్లే తలకు ఎలాంటి తీవ్ర గాయాలు కాలేదని తెలుస్తుంది. అయితే డ్రైవింగ్ టైం లో సాయి ధరం తేజ్ డ్రింక్ చేసి లేడని సమాచారం. Related Post

సినిమా స‌మీక్ష