నిఖిల్ '18 పేజెస్' మోషన్ పోస్టర్..!

September 10, 2021


img

డైరక్టర్ గానే కాదు నిర్మాతగా కూడా సుకుమార్ తన టేస్ట్ చూపిస్తుంటాడు. తను నిర్మాతగా తన కథలనే వేరే డైరక్టర్ తో చేస్తాడు సుకుమార్. కుమారి 21ఎఫ్ సినిమాతో డైరక్టర్ గా సూపర్ హిట్ అందుకున్న సూర్య ప్రతాప్ తన నెక్స్ట్ సినిమా నిఖిల్ తో 18 పేజెస్ అని చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ కథ, కథనం అందిస్తున్నారు.

సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా హీరోయిన్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. అనుపమ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. నిఖిల్ 18 పేజెస్ తో పాటుగా కార్తికేయ 2 సినిమాలో కూడా అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్నారు.

Related Post

సినిమా స‌మీక్ష