నితిన్ 'మాచర్ల నియోజకవర్గం'..!

September 10, 2021


img

యువ హీరో నితిన్ త్వరలో మాస్ట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత నితిన్ నూతన దర్శకుడు రాజశేఖర్ రెడ్డి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో ఈ సినిమాను నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన ఉప్పెన భామ కృతి శెట్టి నటిస్తుంది. సినిమాకు సంబందించిన పూజా కార్యక్రమాలు శుక్రవారం జరిగాయి. అల్లు అరవింద్ గెస్ట్ గా ఈ ముహుర్త కార్యక్రమాలు జరిపారు. 

ఉదయం అలా సినిమా ముహుర్తం పెట్టారో లేదో ఈవినింగ్ కల్లా సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమా టైటిల్ గా మాచర్ల నియోకవర్గం అని ఫిక్స్ చేశారు మేకర్స్. చూస్తుంటే నితిన్ ఈసారి పొలిటికల్ యాక్షన్ మూవీతో వస్తున్నాడని పోస్టర్ చూస్తేనే తెలుస్తుంది. లవర్ బోయ్ గా ప్రేక్షకుల మనసులు గెలిచిన నితిన్ మాస్ హీరోగా ఎలాంటి మెప్పు పొందుతాడో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష