SR కళ్యాణమండపం : రివ్యూ

August 06, 2021


img

రాజావారి రాణివారు సినిమాతో పరిచయమైన కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన సినిమా SR కళ్యాణమండపం. కరోనా వల్ల ఇన్నాళ్లు రిలీజ్ కోసం వెయిట్ చేసిన ఈ సినిమా ఫైనల్ గా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో ఆకట్టుకున్న ఎస్.ఆర్ కళ్యాణమండపం సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ : 

కాలేజ్ లో చదవుతూ ఫ్రెండ్స్ తో జాలీగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం). మూడేళ్లుగా సింధు (ప్రియాంకా జవల్కర్) వెంట తిరుగుతూ ఆమె మీద ఇష్టాన్ని చూపిస్తుంటాడు. తాత హయాంలో బాగా నడిచిన ఎస్.ఆర్ కళ్యాణమండపం తండ్రి కారణంగా వైభవం కోల్పోవడంతో ఆ మండపాన్ని మళ్లీ మంచి స్థాయిలో తీసుకురావాలని కళ్యాణ్ అనుకుంటాడు. ఈ క్రమంలో కళ్యాణ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు..? సింధుతో అతని లవ్ స్టోరీ ఏమైంది..?  తండ్రిని కళ్యాణ్ ఎలా మార్చుకున్నాడు అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

సినిమా రైటర్ కమ్ హీరో కిరణ్ అబ్బవరం తన టాలెంట్ చూపించినా కథ రాసుకున్నంత బాగా కథనం రాసుకోలేదని అనిపిస్తుంది. కథ కూడా కేవలం కళ్యాణ మండపం అన్న కాన్సెప్ట్ తప్ప హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ అంతా రొటీన్ గానే లాగించేశారు. సినిమాలో హీరో ఎలివేషన్ సీన్స్ ఎక్కువ అయ్యాయని చెప్పొచ్చు. 

ఇక సినిమా ఫస్ట్ హాఫ్ కామెడీతో అలా నడిపించగా సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ వరకు సాగదీశారన్న భావన వస్తుంది. సెకండ్ హాఫ్ విషయంలో డైరక్టర్ ఇంకాస్త జాగ్రత్త తీసుకుకుని ఉంటే బాగుండేది. క్లైమాక్స్ లో హీరో, ఫాదర్ మధ్య సీన్స్ కొద్దిగా మెప్పిస్తాయి. సినిమా కథ ఎప్పుడో జరిగినట్టు చూపించినా వారు వాడే ఫోన్లు, టెక్నాలజీ అన్ని ఇప్పటివే అన్నట్టు అనిపిస్తాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ ఒక్కసారి చూసేలా సినిమా ఉంటుందని చెప్పొచ్చు. అయితే కొత్తదనం ఆశించి వెళ్తే మాత్రం నిరాశ తప్పదు. 

నటన, సాంకేతిక వర్గం : 

కిరణ్ అబ్బవరం కళ్యాణ్ పాత్రలో మెప్పించాడు. రెండో సినిమానే అయినా ఎమోషనల్, మాస్, లవ్ ఇలా అన్ని సీన్స్ లో మెప్పించాడు. ప్రియాంకా జవల్కర్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఇక సినిమాలో సాయి కుమార్ తన పాత్ర వరకు బాగా చేశారు. అయితే ఆయన్ను ఇంకా బాగా వాడుకోలేదని అనిపిస్తుంది. ఆయన పాత్ర కూడా ప్రేక్షకులను అసంతృప్తిగా అనిపిస్తుంది. ఆ పాత్రతో ప్రేక్షకులకు ఏం చెప్పదలచుకున్నాడు అన్నది దర్శకుడు మిస్ అయ్యాడేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఇక సినిమాలో హీరో ఫ్రెండ్స్ గా చేసిన వారంతా బాగానే చేశారు. 

టెక్నికల్ టీం విషయానికి వస్తే.. చేతన్ భరధ్వాజ్ మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ పెద్దగా మెప్పించలేదు. డైరక్టర్ కూడా కథను డీల్ చేసిన విధానం ఇంప్రెసివ్ గా అనిపించలేదు. 

ఒక్కమాటలో :

SR కళ్యాణమండపం.. జస్ట్ ఓకే..!

రేటింగ్ : 2/5


Related Post

సినిమా స‌మీక్ష