మెగాస్టార్ మూవీ కథ ఇదేనా..!

August 02, 2021


img

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తర్వాత లూసిఫర్ రీమేక్ చేస్తున్నాడని తెలిసిందే. మోహన్ రాజా డైరక్షన్ లో తెరకెక్కే ఈ మూవీ తో పాటుగా కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో చిరు సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించి లేటెస్ట్ గా ఒక న్యూస్ వైరల్ గా మారింది. ఈ సినిమా కథ గురించి డైరక్టర్ కె ఎస్ రవీంద్రా ఓ క్లూ ఇచ్చాడు. ఒక స్టార్ కి అభిమానికి మధ్య జరిగే కథ అని చెప్పారు డైరక్టర్. ఇలా స్టోరీ లైన్ చెప్పి మెగా ఫ్యాన్స్ లో అంచనాలు పెంచాడు డైరక్టర్ బాబి.

అయితే మళయాళంలో డ్రైవింగ్ లైసెన్స్ అనే సినిమా ఒకటి కూడా స్టార్ హీరోకి అభిమానికి మధ్య జరిగే కథతోనే తెరకెక్కింది. కె.ఎస్ రవీంద్ర సినిమా ఆ మూవీ రీమేక్ గా తీస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే కె.ఎస్ రవీంద్ర స్వతహాగా రైటర్ అవడంతో అతను సొంత కథతోనే చిరుని మెప్పించి ఉంటాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి చిరు, కె.ఎస్ రవీంద్ర సినిమా ఎలా ఉంటుంది.. ఏ కథతో వస్తుంది అన్నది మరి కొద్దిరోజుల్లో తెలుస్తుంది.

Related Post

సినిమా స‌మీక్ష