RRR నుండి దోస్తీ సాంగ్..!

August 02, 2021


img

రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమా నుండి ఫస్ట్ సాంగ్ దోస్తీ వచ్చేసింది. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఆదివారం ఈ సాంగ్ రిలీజ్ చేశారు. తెలుగులో హేమ చంద్ర పాడగా.. మళయాళంలో విజయ్ యేసుదాస్, తమిళంలో అనిరుధ్ రవిచంద్రన్, హిందీలో అమిత్ త్రివేది, కన్నడలో యాజిన్ నజీర్ పాడారు.  


RRR నుండి వచ్చిన ఈ దోస్తీ సాంగ్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. తెలుగు, తమిళ, హిందీ వర్షన్ సాంగ్స్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇలా సాంగ్ రిలీజైందో లేదో అలా రికార్డ్ వ్యూస్ తో పాటుగా లక్షల కొద్దీ లైక్స్ కూడా వచ్చేశాయి. కీరవాణి అద్భుతమిన మ్యూజిక్ ఈ సాంగ్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లుంది. ఇక దోస్తీ స్పెషల్ సాంగ్ చివర్లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఎంట్రీ మరింత క్రేజ్ తెచ్చింది. సినిమాను ఎలా ప్రమోట్ చేయాలో రాజమౌళికి తెలిసినట్టుగా మరెవరికి తెలియదు అంటే నమ్మాలేమో. 


RRR సినిమాను అక్టోబర్ 13న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. నేషనల్ వైడ్ గా మరోసారి తెలుగు సినిమా స్టామినా ప్రూవ్ చేసేందుకు ఈ సినిమా వస్తుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగన్, ఒలివియా మోరిస్, సముద్రఖని వంటి స్టార్స్ నటిస్తున్నారు.
Related Post

సినిమా స‌మీక్ష