చరణ్, శంకర్ కాంబో మూవీ.. హీరోయిన్ ఎనౌన్స్..!

July 31, 2021


img

రాం చరణ్, శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మాతగా ఒక భారీ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వానిని ఫిక్స్ చేశారు. సినిమాలో హీరోయిన్ ను ఫైనల్ చేస్తూ చిత్రయూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. చరణ్ 15వ సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వాని నటిస్తుంది. ఆల్రెడీ చరణ్, కియరా అద్వాని బోయపాటి శ్రీను డైరక్షన్ లో వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో కలిసి నటించారు. మళ్లీ శంకర్ డైరక్షన్ లో ఈ ఇద్దరు కలిసి రొమాన్స్ చేయబోతున్నారు.

వరుస బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న కియర శంకర్ సినిమా అనేసరికి ఛాన్స్ వదులుకోవాలని అనుకోలేదు. అందుకే ఈమధ్య తెలుగు సినిమాల ఆఫర్లను లైట్ తీసుకున్న అమ్మడు చరణ్, శంకర్ కాంబో సినిమాకు మాత్రం సైన్ చేసింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి ఈ సినిమాకు కియరా కూడా కొంత స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని చిత్రయూనిట్ భావిస్తుంది. మొత్తానికి ఆర్సీ 15వ సినిమాలో కియరా లక్కీ ఛాన్స్ అందుకుందని చెప్పొచ్చు.Related Post

సినిమా స‌మీక్ష