'సర్కారు వారి పాట' మహేష్ వచ్చేశాడు..!

July 31, 2021


img

సూపర్ స్టార్ మహేష్, పరశురాం కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ సర్కారు వారి పాట. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సర్కారు వారి పాటకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లేటెస్ట్ ఆ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాలో మహేష్ మాస్ లుక్ తో కనిపిస్తాడని కొన్నాళ్లుగా వినిపిస్తున్న వార్తలకు బలం చేకూరుస్తూ సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ లో మహేష్ మాస్ లుక్ అదిరిపోయింది.


ఇక ఈ సినిమాకు సంబందించిన టీజర్ బ్లాస్ట్ మహేష్ బర్త్ డే సందర్భంగా ఆగష్టు 9న రిలీజ్ చేస్తారని ఎనౌన్స్ చేశారు. అంతేకాదు 2022 సంక్రాంతి బరిలో ఈ సినిమా రిలీజ్ కన్ ఫర్మ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో జనవరి 13 రిలీజ్ అని డేట్ మెన్షన్ చేసి సర్ ప్రైజ్ చేశారు. మొత్తానికి సర్కారు వారి పాట పొంగల్ రేసులో బెర్త్ కన్ ఫర్మ్ చేసుకుంది.Related Post

సినిమా స‌మీక్ష