సర్కారు వారి లీకులు.. మహేష్ ఫైర్..!

July 21, 2021


img

సూపర్ స్టార్ మహేష్, పరశురాం కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ సర్కారు వారి పాట. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. బ్యాంక్ స్కాం ల నేపథ్యంతో తెరకెక్కే ఈ సినిమాలో మహేష్ పోకిరి లుక్ తో కనిపిస్తాడని టాక్. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆరెఫ్సీలో జరుపుకుంటుండగా సినిమాకు సంబందించిన షూటింగ్ పిక్స్, వీడియోస్ బయటకు లీక్ చేశారు. సర్కారు వారి పాట సినిమా నుండి మహేష్ పిక్స్ లీక్ అవడం పట్ల చిత్రయూనిట్ పై సూపర్ స్టార్ మహేష్ అసంతృప్తిగా ఉన్నారట. డైరక్షన్ టీం పై ఆయన ఫైర్ అయినట్టు తెలుస్తుంది.

ఇక మీదట ఇలాంటి లీకులు జరుగకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా కోసం బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అవట్లేదని టాక్. 2022 సంక్రాంతి టార్గెట్ తో ఈ సినిమా చేస్తున్నారు.Related Post

సినిమా స‌మీక్ష