నారప్ప చూసి వావ్ అనేసిన సమంత..!

July 21, 2021


img

విక్టరీ వెంకటేష్ నటించిన నారప్ప సినిమా ఈమధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమేజాన్ ప్రైం లో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. తమిళంలో సూపర్ హిట్టైన అసురన్ సినిమా రీమేక్ గా నారప్పని తెరకెక్కిచారు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సురేష్ బాబు నిర్మించారు. ఇక ఈ సినిమాను చూసిన సెలబ్రిటీ లిస్ట్ లో సమంత చేరింది. సినిమా చూసిన సమంత వావ్ అంటూ కామెంట్ పెట్టి నారప్ప ఫోటో షేర్ చేసింది. నాగ చైతన్యకు మేనమామ అంటే సమంతకు బాబాయ్ వరుస అయ్యే వెంకటేష్ చేసిన నారప్ప సినిమాకు సమంత సూపర్ రివ్యూ ఇచ్చింది.

నారప్ప సినిమాలో వెంకటేష్ నటన చూసిన వారెవరైనా వావ్ అనాల్సిందే. వెంకటేష్ తప్ప అసురన్ రీమేక్ ఎవరి వల్లా కాదు అని ప్రూవ్ చేసుకున్నాడు వెంకటేష్. నారప్పతో పాటుగా దృశ్యం 2 సినిమా కూడా చేస్తున్నాడు వెంకటేష్. ఆ సినిమా కూడా మళయాళ మూవీ రీమేక్ గా వస్తున్న విషయం తెలిసిందే.Related Post

సినిమా స‌మీక్ష